-
-
Home » Andhra Pradesh » Srikakulam » Uttarandhra Bhakta Sammelan in December-MRGS-AndhraPradesh
-
డిసెంబరులో ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం
ABN , First Publish Date - 2022-09-09T04:48:09+05:30 IST
ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం డిసెంబరు 23, 24, 25 తేదీల్లో విశాఖలో నిర్వహి స్తున్నట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి వినిశ్చలానందజీ మహరాజ్ అన్నారు. గురు వారం టెక్కలి, తలగాం, నౌపడా ఆర్‌ఎస్, అక్కవరం గ్రామాల్లో పర్యటించి శ్రీ రామకృష్ణ భావవ్యాప్తిపై ప్రచారం చేశారు.

టెక్కలి: ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనం డిసెంబరు 23, 24, 25 తేదీల్లో విశాఖలో నిర్వహి స్తున్నట్లు రాజమహేంద్రవరం రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి వినిశ్చలానందజీ మహరాజ్ అన్నారు. గురువారం టెక్కలి, తలగాం, నౌపడా ఆర్‌ఎస్, అక్కవరం గ్రామాల్లో పర్యటించి శ్రీ రామకృష్ణ భావవ్యాప్తిపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర భక్త సమ్మేళనంలో పాల్గొని రామకృష్ణుని బోధనలను విస్తృతం చేయాలని కోరారు. ప్రశాంత జీవనానికి ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని, శ్రీరామకృష్ణ, శారదా, వివేకానందుల జీవిత విశేషాలను తెలుసుకుని వారి మార్గంలో పయనించాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయ కన్వీనర్ విశ్వనాథం, ఆయా సమితుల అధ్యక్ష, కార్య దర్శులు, భక్తులు పాల్గొన్నారు.