సార్వత్రిక సమ్మె పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-03-18T05:41:20+05:30 IST

ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం స్థానిక అంబేడ్కర్‌ విజ్ఞాన్‌ మందిరంలో గురువారం ఇఫ్టూ నాయకులు ఆవిష్కరించారు.

సార్వత్రిక సమ్మె పోస్టర్‌ ఆవిష్కరణ


గుజరాతీపేట: ఈ నెల 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం స్థానిక అంబేడ్కర్‌ విజ్ఞాన్‌ మందిరంలో గురువారం ఇఫ్టూ నాయకులు ఆవిష్కరించారు.  కార్యక్ర మంలో ఇఫ్టూ నాయకులు ఎం.క్రాంతి, నేతింటి నీలంరాజు, తదితరులు పాల్గొ న్నారు. ఫ శ్రీకాకుళం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జయదేవికి అంగన్‌వాడీ  కార్యకర్తలు, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి బగాది జగన్నాథరావుకు ఆశ కార్యకర్తలు గురువారం వేర్వేరుగా సమ్మె నోటీసు అందించారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొనున్నట్లు వారు తెలిపారు. సీతంపేట: కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మను విజయవంతం చేయాలని సీఐటీయూ  జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ  కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. మండల కార్యదర్శి భాస్కరరావు పాల్గొన్నారు.


 

Read more