నేడు శ్రీరామనవమి

ABN , First Publish Date - 2022-04-10T05:49:41+05:30 IST

శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలో ఆలయాలు ముస్తాబయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

నేడు శ్రీరామనవమి

నువ్వలరేవులో వారం రోజులపాటు ఉత్సవాలు
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 9 :
శ్రీరామనవమి ఉత్సవాలకు జిల్లాలో ఆలయాలు ముస్తాబయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశామని  గ్రామపెద్ద బెహరాలు తెలిపారు.  ఆలయాలు, వీధులు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. గ్రామంలోని సీతారామాలయం వద్ద జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఒడిశా నుంచి కూడా వస్తుంటారు. వారంరోజులపాటు రాత్రివేళల్లో సాగే యాత్ర, రామకీర్తన గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాగా మూడురోజులపాటు గ్రామదేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Read more