నేడు పాలకొండ బంద్‌

ABN , First Publish Date - 2022-02-23T05:48:12+05:30 IST

పాలకొండను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే శ్రీకాకుళం జిల్లా లోనే ఉంచాలని బుధవారం నిర్వహించనున్న బంద్‌కు ప్రజలు సహకరించాలని పాలకొండ జిల్లా సాధన సమితి నాయకులు కోరారు.

నేడు పాలకొండ బంద్‌
దీక్షలో పాల్గొన్న సాధన సమితి సభ్యులు


పాలకొండ: పాలకొండను జిల్లాగా ప్రకటించాలని, లేకపోతే శ్రీకాకుళం జిల్లా లోనే ఉంచాలని బుధవారం నిర్వహించనున్న  బంద్‌కు ప్రజలు సహకరించాలని పాలకొండ జిల్లా సాధన సమితి  నాయకులు  కోరారు.  జిల్లాల పునర్విభజనలో భాగంగా పాలకొండ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని మంగళవారం దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బుడితి అప్పలనాయుడు, గౌరవాధ్యక్షుడు కనపాక చౌదరినాయుడు సంఘీభావం తెలిపారు.కాగా పట్టణంలోని సిరిస్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు దీక్షలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.   కార్యక్రమంలో సాధన సమితి సభ్యులు రవి, కూర్మారావు, సామంతుల సింహాద్రినాయుడు, ఉప్పలపాటి దామోదరవర్మ, గర్భాన సత్తిబాబు పాల్గొన్నారు.


 


Read more