‘మిస్టర్‌ ఆంధ్రా’ విజేతగా పార్వతీపురం వాసి

ABN , First Publish Date - 2022-12-13T00:04:38+05:30 IST

ఆమదాలవలస పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వరకు 24వ మిస్టర్‌ ఆంధ్రా బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వ హించారు.

‘మిస్టర్‌ ఆంధ్రా’ విజేతగా పార్వతీపురం వాసి
విజేత కిశోర్‌ను అభినందిస్తున్న దృశ్యం

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి వరకు 24వ మిస్టర్‌ ఆంధ్రా బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వ హించారు. ఈ పోటీ ల్లో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి చెందిన డి.కిశోర్‌ విజేతగా నిలిచాడు. ఈ పోటీలను స్థానిక ఏయూ జీమ్‌ నిర్వాహకులు శంకర్‌, పి.తారక్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 280 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతకు ఎస్‌ఐ వై.కృష్ణ, క్రీడాకారులు పేడాడ చిన్నారావు, రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ జె.వెంకటేశ్వరరావు చే తుల మీదుగా అవార్డు అందజేశారు.

Updated Date - 2022-12-13T00:04:38+05:30 IST

Read more