పాఠశాల స్థలం ఆక్రమణపై కొనసాగుతున్న వివాదం

ABN , First Publish Date - 2022-12-13T23:42:16+05:30 IST

గులుమూరు పంచా యతీ జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన స్థలం ఆక్రమణల వివాదం కొనసాగుతోంది. గత మూడు నెలలుగా అధికారులు పాఠశాల స్థలం గుర్తించి ఆక్రమణలు తొలగించ డంలో తాత్సారం చేస్తుండడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు 1.75 ఎకరాలు స్థలం రెవెన్యూ రికా ర్డుల్లో ఉండగా సుమారు 1.40 ఎకరాల స్థలం ఆక్రమణలకు గురైందన్న విషయం విదితమే.

పాఠశాల స్థలం ఆక్రమణపై కొనసాగుతున్న వివాదం
పాత భవనాన్ని కూల్చే పనులు చేస్తున్న గ్రామస్థులు

హిరమండలం, డిసెంబరు 13: గులుమూరు పంచా యతీ జగన్నాథపురం ప్రాథమిక పాఠశాలకు చెందిన స్థలం ఆక్రమణల వివాదం కొనసాగుతోంది. గత మూడు నెలలుగా అధికారులు పాఠశాల స్థలం గుర్తించి ఆక్రమణలు తొలగించ డంలో తాత్సారం చేస్తుండడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు 1.75 ఎకరాలు స్థలం రెవెన్యూ రికా ర్డుల్లో ఉండగా సుమారు 1.40 ఎకరాల స్థలం ఆక్రమణలకు గురైందన్న విషయం విదితమే. ఆక్రమణలను తొలగించాలని అధికారులను గ్రామస్థులు కోరగా రెండు నెలల కిందట తహ సీల్దార్‌, ఎంపీడీవో, సర్వేయర్‌ వెళ్లి సదరు స్థలాన్ని పరిశీ లించారు. తుంగతంపరకి చెందిన సత్యనారాయణ శాస్త్రి సుమారు 40 ఏళ్ల కిందట గ్రామానికి స్థలం విరాళంగా ఇచ్చా రని, అప్పట్లో పాఠశాలకు కేటాయించిన 1.75 ఎకరాలకు హ ద్దులు నిర్ణయించకపోవడంతో సమస్య ఏర్పడిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లా స్థాయిలో ఉన్న సర్వే రికా ర్డులు పరిశీలిస్తున్నామని తహసీల్దార్‌ మురళీమోహన్‌ పేర్కొ న్నారు. అయితే సదరు ఉన్న స్థలం పాఠశాలకు చెందిందేన ని కొంతమంది స్వాధీనం చేసుకొని భవనాలు నిర్మించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆక్రమిత స్థలాన్ని గుర్తించ డంలో అధికారులు కాలయాపన చేస్తుండడంతో పాఠశాల ఆవరణలో ఉన్న పాత భవనాన్ని పడగొట్టి కొత్త భవనాలు నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించారు. ఇందుకు పంచా యతీరాజ్‌ ఈఈ నుంచి రాత పూర్వకంగా అనుమతి పత్రాల ను తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం పాత భవనాన్ని కూల్చేందుకు గ్రామస్థులు సిద్ధపడి పనులు ప్రారంభించారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ భవనం ఆక్రమణదారుడి స్వాధీ నంలో ఉండడంతో అతడు 100కి ఫోన్‌ చేశా డు. పోలీసులు వచ్చి పనులు నిలిపివేయాలని, స్టేషన్‌కు వచ్చి భవనాన్ని కూల్చేందుకు ఆధారాలు చూపాలని సూచించారు. పీఆర్‌ ఈ ఈ అనుమతిచ్చారని చెబుతున్నా సమస్య పరిష్కారమయ్యే వరకు పనులు నిలిపివేయాలని కానిస్టేబుల్‌ కోరారు. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. వెంటనే గ్రామస్థు లంతా తహసీల్దార్‌కు విషయం తెలుపగా తన పరిధిలో లేదని ఎంపీడీవోకు ఫిర్యాదు చేయాలని కోరడంతో వారంతా మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీడీవో సెలవు లో ఉండడంతో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పాఠ శాలకు మంజూరైన ‘నాడు-నేడు’ పనులు చేపట్టేందుకు గడు వు దగ్గర పడుతుండడంతో అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-12-13T23:42:16+05:30 IST

Read more