జిల్లాల విభజన శాస్ర్తీయ పద్ధతిలో లేదు

ABN , First Publish Date - 2022-02-23T05:52:07+05:30 IST

జిల్లాల విభజన శాస్ర్తీయ పద్ధతిలో జరగడంలేదని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు.

జిల్లాల విభజన శాస్ర్తీయ పద్ధతిలో లేదు
తుడ్డలిలో పర్యటిస్తున్న రామ్మోహన్‌నాయుడు

 ఎంపీ రామ్మోహన్‌నాయుడు

బూర్జ: జిల్లాల విభజన శాస్ర్తీయ పద్ధతిలో జరగడంలేదని  ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మంగళవారం మండలంలోని తుడ్డలి, లక్కుపురం, అప్పలపేట, కొల్లివలస, చిన్నలంకాం, ఏబీసీపేట తదితర గ్రామాల్లో  పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లాల విభజన చేయడం తగదన్నారు. రైతుల  నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి సైతం డబ్బులు  ఇవ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు   ఆనెపు రామకృష్ణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Read more