టీడీపీ బలోపేతమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-02T23:36:25+05:30 IST

టీడీపీ బలోపేతమే లక్ష్యంగా అందరూ పనిచేయా లని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.

  టీడీపీ బలోపేతమే లక్ష్యం
గోవిందపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న కళావెంకటరావు

లావేరు, నవంబరు 2: టీడీపీ బలోపేతమే లక్ష్యంగా అందరూ పనిచేయా లని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. గోవిందపురంలో బుధవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మీఅందరి ఆదరాభిమానాలు చూస్తుంటే పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లు ఉందన్నారు. గడిచిన మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కరువయ్యిందన్నారు. లావేరు ప్రాంతానికి సాగునీరు లేక రైతాంగం వలసబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి, మడ్డు వలస పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయన్నారు. వెంకటాపురం-అదపాక రహదారి రాళ్లుతేలి దారుణంగా తయారైనా పట్టించుకునే వారే లేరన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని కోరారు. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. కార్య క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తోటయ్యదొర, నాయకులు ఇజ్జు బాబూరావు, వెంకటేశ్వరరావు, ఎల్లన్న దొర, గంట్యాడ మహేష్‌, లంక నారాయణరావు, మీసాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:36:25+05:30 IST
Read more