నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-24T23:37:53+05:30 IST

నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికల జూనియర్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

పలాసరూరల్‌, నవంబరు 24: నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లా జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికల జూనియర్‌ కళాశాల అప్‌గ్రేడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో విద్యార్థి నులు పదో తరగతి తరువాత విద్యను మానేయకుండా ఇక్కడే ఇంటర్‌ విద్యను చదువకునేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కె.వైకుంఠరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల వెంకటరమణ, సర్పంచ్‌ బాడాన పుష్ప, ఎంపీడీవో రమేష్‌నాయుడు, ఎంఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:37:55+05:30 IST