తీవ్ర ఆందోళనలో రైతులు: Kala venkatrao

ABN , First Publish Date - 2022-01-03T18:10:26+05:30 IST

జిల్లాలో 80 శాతం మంది రైతులు వరి పండించారని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు అన్నారు.

తీవ్ర ఆందోళనలో రైతులు: Kala venkatrao

శ్రీకాకుళం: జిల్లాలో 80 శాతం మంది రైతులు వరి పండించారని, రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతుల కళ్ళల్లో రక్తం కారుతోందని మండిపడ్డారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర దొరకడం లేదన్నారు. కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయటం లేదని తెలిపారు. 5 ఏళ్ల క్రితం వరి బస్తా రూ.1200కు కొనేవారని... ఇప్పుడు రూ.1100కు కొనే పరిస్థితి లేదన్నారు. రైతులు సంక్రాంతి చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. వారి పంటను రైతులు తగలబెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రావాలని... ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

Read more