పూరి-తిరుపతి రైలును నిలిపేలా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-11-24T23:32:07+05:30 IST

పూండి రైల్వేస్టేషన్‌లో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల నాయకులు ఎంపీ రామ్మోహన్‌నాయుడును కోరారు.

 పూరి-తిరుపతి రైలును నిలిపేలా చర్యలు తీసుకోండి

వజ్రపుకొత్తూరు: పూండి రైల్వేస్టేషన్‌లో పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల నాయకులు ఎంపీ రామ్మోహన్‌నాయుడును కోరారు. గురువారం శ్రీకాకుళంలో ఆయన కార్యాలయంలో జిల్లా బీసీ సెల్‌ ప్రధానకార్యదర్శి గోవింద పాపారావు, అమలపాడు, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్‌లు దున్న షణ్ముఖరావు, చింతనారాయణ కలిసి వినతిపత్రం అందించారు. కరోనాకు ముందు పూరి-తిరుపతి రైలు హాల్ట్‌ ఉండేదని, ప్రస్తుతం నిలపడం లేదని, దీంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ రైల్వే అధికారులతో చర్చిస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-24T23:32:07+05:30 IST

Read more