డప్పు కళాకారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2022-11-30T23:31:28+05:30 IST

డప్పు కళాకారులను ఆదుకోవాలని ప్రజాసంఘాల ప్రతినిధులు కోరా రు. ఉమ్మడి శ్రీకాకుళ జిల్లా దళిత డప్పు కళాకారుల సంఘ జిల్లా ద్వితీయ మహా సభలు డిసెంబరు 20న కొత్తూరులో జరుగుతున్నందున కరపత్రాలను సూదికొం డలో బుధవారం ఆవిష్కరించారు.

డప్పు కళాకారులను ఆదుకోండి

పలాస: డప్పు కళాకారులను ఆదుకోవాలని ప్రజాసంఘాల ప్రతినిధులు కోరా రు. ఉమ్మడి శ్రీకాకుళ జిల్లా దళిత డప్పు కళాకారుల సంఘ జిల్లా ద్వితీయ మహా సభలు డిసెంబరు 20న కొత్తూరులో జరుగుతున్నందున కరపత్రాలను సూదికొం డలో బుధవారం ఆవిష్కరించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయ కుడు సన్నశెట్టి రాజశేఖర్‌, దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గణేష్‌ మాట్లాడుతూ.. ప్రతీ డప్పు కళాకారుడికి మూడుసెంట్ల స్థలాన్ని ఇవ్వాలని, దళారీల నుంచి దళితుల భూముల రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మార్పు మెమోరియల్‌ ట్రస్టు అధ్యక్షుడు మట్ట ఖగేశ్వరరావు, కళింగ సీమ సాహిత్య సంస్థ ఉపాధ్యక్షుడు ఎన్‌.ప్రభాకరరావు, పుట్టమ ఢిల్లేశ్వరరా వు, తోట సిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:31:28+05:30 IST

Read more