జీవనోపాధికి స్త్రీనిధి రుణాలు ఉపయోగపడాలి
ABN , First Publish Date - 2022-12-13T23:36:46+05:30 IST
మహిళా సంఘాలకు అందిస్తున్న స్త్రీనిధి రుణాలు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ప్రోత్సహించాలని స్త్రీనిధి ఏజీఎం వి.సత్యనారాయణ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, వీవోలు, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

జలుమూరు: మహిళా సంఘాలకు అందిస్తున్న స్త్రీనిధి రుణాలు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ప్రోత్సహించాలని స్త్రీనిధి ఏజీఎం వి.సత్యనారాయణ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, వీవోలు, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులు లేక సుదూర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళుతున్న మహిళలను గుర్తించి స్త్రీనిధి రుణాలు అందించి వలసలు నివారించాలన్నారు. సమావేశంలో స్త్రీనిధి మేనేజర్లు శ్రీనివాసరావు, నాగరాజు, ఏపీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read more