చోరీ చేసి.. గడ్డివాములో దాచి..

ABN , First Publish Date - 2022-11-30T23:42:19+05:30 IST

మురపాక మద్యం దుకాణంలో సో మవారం అర్ధరాత్రి చోరీకి గురైన మద్యం సీసాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

చోరీ చేసి.. గడ్డివాములో దాచి..
గడ్డివాములో దాచిన మద్యం కేసులు

లావేరు: మురపాక మద్యం దుకాణంలో సో మవారం అర్ధరాత్రి చోరీకి గురైన మద్యం సీసాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాచ్‌మన్‌ కాలు చేతులను కట్టేసి మద్యం దుకాణానికి రంధ్రం చేసి 7,087 సీసాలను అపహ రించిన విషయం తెలిసిం దే. వీటి విలువ సుమారు రూ.11.57 లక్షలు వరకు ఉంటుందని అధికారులు అం చనా వేశారు. ఈ నేపథ్యంలో లావేరు ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం కేశవరాయునిపాలెం లోని ఓ తోటలో వరి గడ్డి వాములో దాచి పెట్టిన మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి అట్టలను కాల్చివేశారు. నిందితులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

Updated Date - 2022-11-30T23:42:19+05:30 IST

Read more