జాతీయస్థాయి షార్ట్‌ఫుట్‌ పోటీలకు శ్రీకాంత్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-12-31T23:46:29+05:30 IST

విజయనగరం జేఎన్‌టీయూ స్థాయిలో నిర్వహించిన షార్ట్‌ఫుట్‌ పోటీల్లో ఐతం కళాశాల విద్యార్థి గార శ్రీకాంత్‌ బంగారు పతకం గెలుచుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యాడని డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు తెలిపారు.

జాతీయస్థాయి షార్ట్‌ఫుట్‌ పోటీలకు శ్రీకాంత్‌ ఎంపిక

టెక్కలి: విజయనగరం జేఎన్‌టీయూ స్థాయిలో నిర్వహించిన షార్ట్‌ఫుట్‌ పోటీల్లో ఐతం కళాశాల విద్యార్థి గార శ్రీకాంత్‌ బంగారు పతకం గెలుచుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక య్యాడని డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు చెన్నైలో జరుగు జాతీయ క్రీడల్లో పాల్గొంటారన్నారు. అలాగే ఖోఖో విభాగంలో నౌపడ ఢిల్లేశ్‌, దూబ ప్రేమ్‌ సాయి సౌతజోన్‌ బృందం తరఫున పాల్గొనేందుకు ఎంపికయ్యారన్నారు.

జిల్లాస్థాయి పోటీలో వడ్డివాడ జట్టు...

సంతబొమ్మాళి: జిల్లాస్థాయి అంతర్‌ పాఠశాలల సీనియర్‌ బాలికల కబడ్డీ పోటీల్లో వడ్డివాడ జడ్పీ ఉన్నత పాఠశాల జట్టు విజేతగా నిలిచింది. శ్రీకాకుళంలో శనివారం ఈ పోటీలు జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలను ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - 2022-12-31T23:46:31+05:30 IST

Read more