సమగ్ర దర్యాప్తుతో కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-09-14T04:50:27+05:30 IST

సమగ్రమైన దర్యాప్తుతో కేసులను పరిష్కరించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశించారు.

సమగ్ర దర్యాప్తుతో కేసుల పరిష్కారం
మాట్లాడుతున్న ఎస్పీ రాధిక :



ఎస్పీ జీఆర్‌ రాధిక


అరసవల్లి, సెప్టెంబరు 13: సమగ్రమైన దర్యాప్తుతో కేసులను పరిష్కరించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాల యంలో సర్కిల్‌ వారీగా పోలీసు అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హత్య కేసులు, పోక్సో, రేప్‌ కేసులు, క్రైమ్‌ అగెనెస్ట్‌ ఉమన్‌, ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. నేరాల నియంత్ర ణకు సబ్‌ డివిజన్‌ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నైట్‌ బీట్స్‌ బలోపేతం చేసి అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు,  దర్యాప్తు, ఛార్జిషీటు దాఖలు వరకు లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలని, కోర్టులో అభియోగ పత్రాలను వీలైనంత వేగంగా దాఖలు చేయాలని సూచించారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యాం క్‌లు, వ్యాపార సముదాయాలు, దేవాలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ (క్రైమ్‌) టీపీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. 

నకిలీ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దు

నకిలీ లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకొని వేధింపులకు గురికావద్దని  ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు.  ఇటువంటి యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవడం వలన కలిగే అనర్థాల గురించి జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని మహిళా పోలీసులు.. వార్డులు, గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో నకిలీ లోన్‌ యాప్‌ల గురించి, వాటి ద్వారా కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా చదువుకుంటున్న యువత, మహిళలు ఈ ఆన్‌లైన్‌, ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌ల పట్ల ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఇటువంటి లోన్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసేటప్పుడు మీ కాంటాక్ట్స్‌, మీడియా, గ్యాలరీ, కెమెరాలకు సంబంధించి ఎటువంటి పర్మిషన్స్‌ ఇవ్వకూడదన్నారు. రుణాల కోసం బ్యాంకులను, ప్రముఖ ఫైనాన్సింగ్‌ సంస్థలను ఆశ్రయించడమే మేలని వివరించారు.


  


Updated Date - 2022-09-14T04:50:27+05:30 IST