అట్రాసిటీ కేసులను పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-09-24T04:57:02+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అట్రాసిటీ కేసులను పరిష్కరించండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించేది లేదు
-  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
అరసవల్లి సెప్టెంబరు 23:
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్‌ అండ్‌ మోనటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. అట్రాసిటీ కేసులు పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎస్పీ రాధిక మాట్లాడుతూ.. కోర్టు కేసులు, కుల ధ్రువీకరణ, భూహక్కుల వివరాలు అందించడంలో తహసీల్దార్లు జాప్యం చేస్తున్నారని, దీంతో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని వివరించారు. కుల ధ్రువీకరణ  పత్రాలను తక్షణమే అందించేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని  డీఆర్వో రాజేశ్వరిని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల కోసం సొంత భవనంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ సంచాలకుడు కె.రామారావుకు సూచించారు. తొలుత డీవీఎంసీలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలను వివరించారు. ప్రతీ మూడు నెలలకు సమావేశం నిర్వహించి ప్రగతిని వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో  జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు బొడ్డేపల్లి శాంతి, హెచ్‌వీ జయరావు, బోసు మన్మథరావు, బి.నగేష్‌, బి.సంజీవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-09-24T04:57:02+05:30 IST