‘ఉపాధి’లో ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2022-03-05T04:26:24+05:30 IST

ఉపాధి హామీ పనుల విషయంలో జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికా రులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అడిగిన వారందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు.

‘ఉపాధి’లో ఆదర్శంగా నిలవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లాఠ్కర్‌

అడిగిన వారందరికీ పని కల్పించండి

 కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ 

కలెక్టరేట్‌, మార్చి 4: ఉపాధి హామీ పనుల విషయంలో జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికా రులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అడిగిన వారందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. ప్రతిరోజూ  2.55 లక్షల మంది వేతనదారులు పనిలో ఉండాలన్నదే లక్ష్య మన్నారు. కానీ, 75వేల మంది మాత్రమే పనిలో ఉంటున్నా రని తెలిపారు. ఈ పరిస్థితి మారేందుకు ఎక్కువ పనులు గుర్తించాలని ఆదేశించారు.  ప్రభుత్వ లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలన్నారు.  మేట్ల రిజిస్ట్రేషన్‌ జరగాలన్నారు. పాఠశాలల ప్రహరీలు, శ్మశానవాటికలు, రిటైనింగ్‌ వాల్స్‌, తదితర పను లను ఈనెల 31 నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి బిల్లులు రూ.60కోట్లు విడుదలైనట్లు చెప్పారు. మండల అభివృద్ధి అధికారులు నెలలో కనీసం 15 తనిఖీలు నిర్వహించా లని ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో 1,180 కేంద్రాలు ఉండగా, 640 కేంద్రాలనే వినియోగిస్తున్నట్లు చెప్పారు. జలకళ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో నెలకు 10 చొప్పున బోర్లు వేయాలని కలెక్టర్‌ తెలిపారు. జేసీ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ.. సమన్వయంతో ఉపాధి పను లు చేయాలని, ఇంకా రూ.97 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. మరో రూ.40 కోట్ల వరకు మెటీరియల్‌ కాంపోనెంట్‌  రానుందని చెప్పారు. గృహ నిర్మాణ లేఅవుట్లకు అప్రోచ్‌ రోడ్లు వేయాలని, రోజువారీ వేతనదారులు సంఖ్య పెరగాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ ఆర్‌.శ్రీరాము లునాయుడు, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు. జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, ఏపీడీలు ఎం.రోజారాణి, ఎ.విద్యాసాగర్‌, వాసుదేవ రావు , అలివేలుమంగ తదితరులు పాల్గొన్నారు. 


Read more