గిరిజన గూడలో తాగునీటి వెతలు

ABN , First Publish Date - 2022-11-24T23:24:05+05:30 IST

గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్నామని, గిరిసీమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నేతలు చేసే ప్రకటనలు వాస్తవరూపం దాల్చడం లేదు. క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగ ళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో నేతల మాటలు నీటి మూట లుగానే ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గిరిజన గూడలో తాగునీటి వెతలు
నువ్వుగుడ్డి గ్రామం

25 కుటుంబాలకు రెండు బోర్లే ఆధారం

ఇదీ నువ్వుగుడ్డి గ్రామ దుస్థితి

(టెక్కలి, టెక్కలి రూరల్‌)

గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్నామని, గిరిసీమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నేతలు చేసే ప్రకటనలు వాస్తవరూపం దాల్చడం లేదు. క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగ ళి అక్కడే అన్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో నేతల మాటలు నీటి మూట లుగానే ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ నువ్వుగుడ్డి గిరిజన గ్రామంలో సుమారు 25 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఎక్కువ మంది దినసరి కూలీలే. ఏళ్ల తరబడి తాగునీటి కష్టాలు వెన్నాడుతున్నా పరిష్కారానికి బాటలు పడడం లేదు. దీంతో ఆ గ్రామస్థులు దాహార్తితో అలమటిస్తున్నారు. గ్రామంలో 25 కుటుంబాల్లో సుమారు 100 మంది వరకు ఉంటున్నారు. గ్రామంలో ఉన్న రెండు బోరుబావులే తాగునీటి ఆధారం. గ్రామంలో రెండు బావు లున్నప్పటికీ ఆ నీరు తాగేందుకు అను కూలంగా లేవని, కేవలం వాడుకలకు మాత్రమే వినియోగిస్తున్నామని స్థాని కులు వాపోతున్నారు. బావులు కూడా అడుగంటు తున్నా యని, దీంతో నీటి కష్టాలు తమను వీడడం లేదని పేర్కొంటున్నారు. సుమారు ఆరు నెలల కిందట తాగునీటి సరఫరా కోసం బోరు వేసినప్పటికీ దాని నుంచి మంచి నీరు సరఫరా నేటికీ సర ఫరా చేయలేదు. గ్రామంలోని తాగునీటి సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

జల్‌జీవన్‌లోనూ చోటివ్వలేదు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి సదుపాయం నిమిత్తం జల్‌జీవన్‌ మిషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ అందులో ఈ గ్రామానికి చోటు కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మా గ్రామ తాగునీటి అవసరాలు ఎప్పుడు నెరవేరు తాయా అని గ్రామస్థులు చకోరాల్లా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పథకంలో గ్రామానికి చోటు కల్పించడంలో అధికారులు విఫలమయ్యా రన్న వాదనలొస్తున్నాయి. గ్రామంలోని రెండు బోర్ల నుంచే నీటిని తీసుకువెళుతున్నామని, వీటిలో ఏ ఒక్కటి పాడైనా మా పరిస్థితి దారు ణంగా తయార వుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బావు ల్లోని నీరు కూడా రంగు మారుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామ తాగు నీటి అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటు న్నారు. ఈ సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మోహన్‌ వద్ద ప్రస్తావించ గా నువ్వు గుడ్డి గ్రామానికి జల్‌జీవన్‌ తొలి ఫేజ్‌లో నిధులు మంజూరు కాలేద న్నారు. గ్రామంలోని తాగునీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నామని చెప్పారు.

తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం

గ్రామంలో తాగునీటికి రెండు బోర్లే ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి తాగునీటి సమస్య లతో ఇబ్బందులు పడుతున్నాం. సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

ఎన్‌.భారతి, నువ్వుగుడ్డి గ్రామం, టెక్కలి మండలం

సమస్యను పరిష్కరించాలి

గ్రామంలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య ఉంది. సుమారు 25 కుటుంబాల్లో 100 మంది ఉంటున్నాం. వేసవికాలం వస్తే తాగునీటి సమస్య మరింత జఠిలం అవుతుంది. అందువల్ల తక్షణం తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం.

ఎన్‌.వెంకటరావు, గ్రామస్థుడు

Updated Date - 2022-11-24T23:24:05+05:30 IST

Read more