‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో కార్మికులను నమోదు చేయండి

ABN , First Publish Date - 2022-02-20T05:00:54+05:30 IST

ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేయాలని కేంద్ర కార్మికశాఖ రీజనల్‌ కమిషనర్‌ ఎస్‌కే మహంతి అన్నారు. శనివారం స్థానిక ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు.

‘ఈ-శ్రమ్‌’ పోర్టల్‌లో కార్మికులను నమోదు చేయండి
మాట్లాడుతున్న కేంద్ర కార్మికశాఖ రీజనల్‌ కమిషనర్‌ మహంతి


 కేంద్ర కార్మికశాఖ రీజనల్‌ కమిషనర్‌ ఎస్‌కే మహంతి

టెక్కలి, ఫిబ్రవరి 19: ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కార్మికుల వివరాలు నమోదు చేయాలని కేంద్ర కార్మికశాఖ రీజనల్‌ కమిషనర్‌ ఎస్‌కే మహంతి అన్నారు. శనివారం స్థానిక ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టు 16 నుంచి ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు ప్రక్రియ చేపట్టి నట్లు తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రంలో 2,33,949 మంది కార్మికులు నమోదయ్యారన్నారు. కార్మి కులు, అసంఘటిత రంగ కార్మికులు తమ వివరాలు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమ యంలో వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం ఆర్థిక సహా యాన్ని అందిస్తున్నారు. 16 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న కార్మికులు అర్హులని, అర్హులైన లబ్ధిదారులు మీసేవ కేంద్రాలు, సీఎస్‌ఈ కేంద్రా లు, పోస్టాఫీసుల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. సమా వేశంలో కేంద్ర లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎల్‌.మురళీకృష్ణ, రాధాకుమారి, విశాఖ ఏసీ కొండల రావు, గోవిందరావు, మురళి, ఉత్తరాంధ్ర గ్రానైట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి హరికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Read more