పట్టపగలే బంగారు ఆభరణాలు చోరీ

ABN , First Publish Date - 2022-04-05T05:50:41+05:30 IST

పట్టపగలే బంగారు ఆభరణాలు చోరీ

పట్టపగలే బంగారు ఆభరణాలు చోరీ

ఎచ్చెర్ల : కుశాలపురం పరిధి నవభారత్‌ పారి శ్రామికవాడకు సమీపంలో సోమవారం పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు... కళ్లేపల్లి తవుడు అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తవుడు భార్య ఆదిలక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి తలుపులు దగ్గరకు వేసి, కిరాణా సామానులు కొనుగోలుకు సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లింది. దీన్ని గమనించిన ఆ వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు పగలగొట్టి పుస్తెలతాడు, గొలుసు, చెవి దిద్దులతో పాటు మరో రెండు వస్తువులు అపహరిం చుకుపోయారు. ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read more