అక్రమ అరెస్టులపై నిరసన

ABN , First Publish Date - 2022-11-30T23:29:15+05:30 IST

పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని తలపెట్టిన ధర్నా భగ్నం, ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కాశీబుగ్గ, టెక్కలిల్లో బుధవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

అక్రమ అరెస్టులపై నిరసన

కాశీబుగ్గ/టెక్కలి రూరల్‌: పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని తలపెట్టిన ధర్నా భగ్నం, ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా కాశీబుగ్గ, టెక్కలిల్లో బుధవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర, జిల్లా, కార్యదర్శివర్గ సభ్యులు కె.రమేష్‌, కోదండ రావు, చిట్టి బాబు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం చేయకుండా ఉక్కు పాదాలతో అణచి వేయాలని చూస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు జి.రమేష్‌, ఈశ్వరరావు, కోండలరావు, యూటీ ఎఫ్‌ టెక్కలి మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, పి.జగదీష్‌, జిల్లా కార్యదర్శి కురమాన దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:29:15+05:30 IST

Read more