అంచనాలు సిద్ధంచేయండి: స్పీకర్‌

ABN , First Publish Date - 2022-04-25T05:07:09+05:30 IST

వెంకయ్యపేటలో పాఠశాల భవనం మరమ్మతుకు నాడు-నేడు భాగంగా అంచనాలు సిద్ధంచేయాలని, కమ్యూనిటీ భవనానికి ప్రతిపాదనలు తయారుచేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.

అంచనాలు సిద్ధంచేయండి: స్పీకర్‌
స్పీకర్‌కు సమస్యలు వివరిస్తున్న గ్రామస్థులు


ఆమదాలవలస: వెంకయ్యపేటలో పాఠశాల భవనం మరమ్మతుకు నాడు-నేడు భాగంగా అంచనాలు సిద్ధంచేయాలని, కమ్యూనిటీ భవనానికి ప్రతిపాదనలు తయారుచేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. ఆదివారం ము నిసిపాలిటీలోని 23వ వార్డులోని వెంకయ్యపేటలో స్పీకర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్‌ పఽథకం అమలుచేయాలని  చేనేత కార్మికులు  సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్‌, బి.రమేష్‌కుమార్‌, బొడ్డేపల్లి ఏకాశమ్మ, బి.రాజులు పాల్గొన్నారు.

 



Read more