నిర్బంధం

ABN , First Publish Date - 2022-04-25T04:15:33+05:30 IST

నిర్బంధం

నిర్బంధం
కంచిలి : పోలీసుస్టేషన్‌లో యూటీఎఫ్‌ నాయకులు

- యూటీఎఫ్‌ నేతల ముందస్తు అరెస్టులు

(ఆంధ్రజ్యోతి బృందం)

జిల్లావ్యాప్తంగా ఆదివారం యూటీఎఫ్‌ నేతలను పోలీసులు నిర్బంధించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ సోమవారం యూటీఎఫ్‌ సీఎంవో ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉపాధ్యాయ సంఘ నేతలు అమరావతి బయలుదేరేందుకు సన్నద్ధమవ్వగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బస్సులు, వాహనాలు తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని ఇళ్ల వద్ద నిర్బంధించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ నాయకులు ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తామన్న సీఎం జగన్‌ తన మాట నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అక్రమ అరెస్టులు ఆపాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 


Read more