సచివాలయ ఉద్యోగులపై పీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2022-11-11T23:40:14+05:30 IST

కర్లమ్మ సచివాలయాలు, కొత్తూరు అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఐటీడీఏ పీవో బి.నవ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తూరు-2 సచివాలయంలో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

 సచివాలయ ఉద్యోగులపై పీవో ఆగ్రహం

కొత్తూరు: కొత్తూరు-1, 2, కర్లమ్మ సచివాలయాలు, కొత్తూరు అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం ఐటీడీఏ పీవో బి.నవ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తూరు-2 సచివాలయంలో రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయ సిబ్బంది యూనిఫారం ఎందుకు ధరించడం లేదని ప్రశ్నించారు. పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-11T23:40:14+05:30 IST

Read more