పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2022-11-30T23:34:33+05:30 IST

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఏ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఎచ్చెర్ల, నవంబరు 30: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైందని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఏ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోని విద్యార్థులు శుక్రవారం లోపు వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్దేశించిన తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను ఇవ్వాలన్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో సర్టిఫి కెట్ల పరిశీలన ఉంటుందన్నారు. 4 నుంచి 6వ తేదీ వరకు కోర్సులు, కళాశాలల ఎంపికకు ఆప్షన్లను ఇచ్చుకోవాలన్నారు. 6న ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. 8న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడవుతుందని తెలిపారు.

Updated Date - 2022-11-30T23:34:33+05:30 IST

Read more