వైసీపీ నాటకాన్ని ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2022-11-02T23:38:10+05:30 IST

పొందూరు: మూడు రాజ ధానులపై వైసీపీ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు నమ్మడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

వైసీపీ నాటకాన్ని ప్రజలు నమ్మరు
మాట్లాడుతున్న రవికుమార్‌:

పొందూరు: మూడు రాజ ధానులపై వైసీపీ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు నమ్మడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. బు ధవారం పొందూరులో టీడీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విధ్వేషాలను రగల్చడమే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, వైసీపీ నాయకుల లక్ష్యమని విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్రను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టులో వేసిన కేసులో తీర్పు వ్యతిరేఖంగా వచ్చినా వైసీపీ నాయకులకు సిగ్గులేదన్నారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న ర్యాలీలకు విద్యార్థులను బలవం తంగా తరలిస్తున్నరని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా రాజధాని అమరావతిని కద ల్చడం ప్రభుత్వం తరంకాదన్నారు. సమా వేశంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్‌, మురళి, నాయకులు రాము, శంకరభాస్కర్‌, రంగా, బాడాన గిరి, కె.శాం తారాం, కాలెపు శ్రీను, ఎర్రా కిశోర్‌, పి.శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:38:10+05:30 IST
Read more