వైభవంగా జగన్నాథుని పానీ హాటీ ఉత్సవం

ABN , First Publish Date - 2022-06-13T05:03:42+05:30 IST

వైభవంగా జగన్నాథుని పానీ హాటీ ఉత్సవం

వైభవంగా జగన్నాథుని పానీ హాటీ ఉత్సవం
ఉత్సవమూర్తులను స్నానాలు ఆచరించి బయటకు తెస్తున్న భక్తులు

జలుమూరు, జూన్‌ 12: పర్లాం మాకివలసలో జగన్నాథస్వామి పానీ హాటీ ఉత్సవం ఆదివారం నిర్వహించారు. అర్చకుడు శ్రీనికేతన్‌ కృష్ణదాస్‌ నేతృత్వంలో ఉదయం బలభద్ర, సుభద్ర సహిత జగన్నాఽథస్వామిలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో వేంచేసి హరేరామ స్మరణతో వంశధార నదికి తీసుకెళ్లారు. అనంతరం నదిలో స్వామి వారికి పుణ్యస్నానం చేయించారు. మాకివలసతో పాటు పలు గ్రామాల భక్తులు పాల్గొని పునీతులయ్యారు.  మధ్యాహ్నం అన్నసంతర్పణ  నిర్వహించారు. ఏటా జేష్టమాసం త్రయోదశి పర్వదినాన స్వామికి పానీ హాటీ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకుడు తెలిపారు. పూరీలో జగన్నాఽథస్వామికి నిర్వహించే పానీ హాటీ ఉత్సవం సంప్రదాయబద్ధంగా మాకివలసలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణచైతన్య భజన కుటీర సభ్యులు, ట్రస్టు సభ్యుడు జనకమోహనరావు పాల్గొన్నారు.

Read more