కౌలు రైతులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-15T23:28:38+05:30 IST

కౌలురైతులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఆ సంఘం జిల్లా నాయకుడు పోలాకి ప్రసాదరావు అన్నారు. కౌలు రైతుల మహాసభల పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు.

కౌలు రైతులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

వజ్రపుకొత్తూరు: కౌలురైతులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఆ సంఘం జిల్లా నాయకుడు పోలాకి ప్రసాదరావు అన్నారు. కౌలు రైతుల మహాసభల పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కౌలు రైతులు అప్పులూబిలో ఇరుక్కుపోతున్నారన్నారు. రైతులు నష్టపోకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ నెల 21, 22 తేదీల్లో పల్నాడు జిల్లా చిలకలూరులో నిర్వహిస్తున్న మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, వి.వెంకటరమణ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:29:31+05:30 IST

Read more