నవంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2022-09-25T06:20:58+05:30 IST

జాతీయ లోక్‌అదాలత్‌ను నవంబరు 12న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు.

నవంబర్‌ 12న జాతీయ లోక్‌అదాలత్‌
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి భారతి

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 24 : జాతీయ లోక్‌అదాలత్‌ను నవంబరు 12న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో నిర్వహిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి తెలిపారు. స్థానిక జిల్లా న్యాయస్థానం ఆవరణలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ పడదగిన అన్ని క్రిమినల్‌, సివిల్‌, వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో ఇరువర్గాల వారు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా చెల్లని చెక్కు కేసుల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎస్పీ మలికగర్గ్‌ మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి శివకుమార్‌, ఒంగోలు, కందుకూరు, చీరాల ఆర్డీవోలు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. 


Read more