అధికారులతో ఎంపీపీ భర్త సమీక్ష

ABN , First Publish Date - 2022-11-19T00:05:00+05:30 IST

మండల పరిషత్‌ కార్యా లయంలో శుక్రవారం ఎంపీపీ భర్త సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది.

అధికారులతో ఎంపీపీ భర్త సమీక్ష
ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో మాట్లాడుతున్న ఎంపీపీ భర్త రామారావు

ఎల్‌ఎన్‌ పేట: మండల పరిషత్‌ కార్యా లయంలో శుక్రవారం ఎంపీపీ భర్త సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. దీనికి ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, పీఆర్‌ ఏఈ ఎన్‌.భాస్కరరావు, ఏపీవో శ్రీదేవి హాజరు కావడం గమనార్హం. ఇంజి నీరింగ్‌ అసిస్టెంట్ల పనితీరు మెరుగుపడాలని, లేకుంటే జిల్లా అధికారులకు ఫిర్యా దు చేస్తానని ఎంపీపీ భర్త రెడ్డి రామారావు హెచ్చరించడం విస్మయం కలిగిస్తోంది. గ్రామసచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ కేంద్రాలు, పాలకేంద్రాల బిల్లుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.

Updated Date - 2022-11-19T00:05:00+05:30 IST

Read more