-
-
Home » Andhra Pradesh » Srikakulam » MP special pujas for Kottammathalli-NGTS-AndhraPradesh
-
కొత్తమ్మతల్లికి ఎంపీ ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-06-07T06:15:09+05:30 IST
స్థానిక కొత్తమ్మతల్లిని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఎస్వీ రమణమూర్తి స్వాగతం పలకగా అర్చకుడు రాజేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందించారు.

కోటబొమ్మాళి: స్థానిక కొత్తమ్మతల్లిని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఎస్వీ రమణమూర్తి స్వాగతం పలకగా అర్చకుడు రాజేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం అందించారు. అనంతరం ఆలయ ప్రాగణంలో చేపట్టిన హుండీల లెక్కంపును పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, కోరాడ పెద్దగోవింద రావు, అచ్చుతరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదాయం రూ.3.12 లక్షలు
కొత్తమ్మతల్లి ఆలయంలోని ఆరు హుండీలు సోమవారం లెక్కించగా 70 రోజు లకు గాను రూ.3,12,670 ఆదాయం వచ్చిందని ఈవో ఎస్వీ రమణమూర్తి తెలిపారు. లెక్కింపు సోంపేట దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ కె.వెంకటరమణ పర్యవే క్షించారు. కార్యక్రమంలో స్థానికులు బోయిన కృష్ణారావు, లాడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.