Jagan కోసం నేను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారుతా..: MLC Duvvada

ABN , First Publish Date - 2022-05-30T16:50:11+05:30 IST

అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Jagan కోసం నేను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారుతా..: MLC Duvvada

Srikakulam: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu)పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతా... అలా కొట్టకపోతే తాను దువ్వాడనే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. జగన్ (Jagan) కోసం తాను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారతానన్నారు. మహానాడు వేదికపై మాట్లాడిన ప్రతి ప్రేలాపనకూ సమాధానం చెబుతానన్నారు. ఆకాశ లక్కవరం, వడ్డీతాండ్ర గ్రామాలకు వెళ్లలేని దుస్థితి అచ్చెన్నదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆహుతి సినిమాలో విలన్ని కొట్టినట్టు తరిమి తరిమి కొడతానని దువ్వాడ అన్నారు.

Updated Date - 2022-05-30T16:50:11+05:30 IST