అవినీతికి మారుపేరు మంత్రి అప్పలరాజు

ABN , First Publish Date - 2022-12-04T23:50:45+05:30 IST

పలాస నియోజకవర్గంలో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అవినీతికి మారుపేరుగా నిలిచారని, కొండలు మాయం చేస్తున్నారని, ఆయ నపై సాక్షాత్తు మావోయిస్టులే హెచ్చరికల లేఖలు విడుదల చేశారంటే పరి స్థితి అర్థం చేసుకోవచ్చని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నా రు. ఆదివారం పట్టణంలోని ఒకటో వార్డు మొగిలిపాడు గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు.

అవినీతికి మారుపేరు మంత్రి అప్పలరాజు
మొగిలిపాడులో ర్యాలీ నిర్వహిస్తున్న గౌతు శిరీష, టీడీపీ నాయకులు

పలాస: పలాస నియోజకవర్గంలో మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అవినీతికి మారుపేరుగా నిలిచారని, కొండలు మాయం చేస్తున్నారని, ఆయ నపై సాక్షాత్తు మావోయిస్టులే హెచ్చరికల లేఖలు విడుదల చేశారంటే పరి స్థితి అర్థం చేసుకోవచ్చని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నా రు. ఆదివారం పట్టణంలోని ఒకటో వార్డు మొగిలిపాడు గ్రామంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఆయన అవినీతిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు. అధికారం ఎప్పుడూ ఒకరికే ఉండదని, తాము అధికారంలోకి వస్తే మంత్రిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నా రు. మొగిలిపాడు గ్రామంలో పాఠశాల విలీనం చేయవద్దని ఓ బాలిక తల్లి ప్రశ్నిస్తే అధికారమదంతో ఆమెకు ఇబ్బందులు పెట్టి గ్రామం నుంచి వెళ్లి పోయే పరిస్థితి తీసుకురావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పట్టణం లో మూడేళ్లుగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకుల నుంచి కార్యకర్తల వరకు దోచుకోవడమే జరుగుతోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో రాష్ట్రంలో వైసీపీ పీడను వదిలించాలని పిలుపునిచ్చారు. ప్రజావేదిక కూల్చి వేత నుంచి అప్రజాస్వామిక పాలన ప్రారంభించారన్నారు. సొంత బాబాయి హత్య కేసులో విచారణ ఈ రాష్ట్రంలో సజావుగా జరగదని తెలంగాణాకు మార్చారంటే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, నేతలు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గాలి కృష్ణారావు, దడియాల నర్సింహులు, బడ్డ నాగరాజు, టంకాల రవిశంకర్‌గుప్తా, సప్ప నవీన్‌, శంకర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:50:47+05:30 IST