వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాలు

ABN , First Publish Date - 2022-11-30T00:03:40+05:30 IST

గుంటూరు జిల్లా నాగార్జున యూని వర్సీటీ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారు లు సత్తాచాటినట్టు అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొత్తకోట శ్రీనివాసరావు మంగళ వారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాలు
విజేతలతో కోచ్‌లు అప్పలరామయ్య, అప్పన్న

ఆమదాలవలస: గుంటూరు జిల్లా నాగార్జున యూని వర్సీటీ ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారు లు సత్తాచాటినట్టు అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కొత్తకోట శ్రీనివాసరావు మంగళ వారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. జిల్లా నుంచి ఈ పోటీల్లో 14 మంది క్రీడాకారులు పాల్గొనగా ఐదుగురు పతకాలు సాధించారన్నారు. నరసన్నపేటకు చెందిన ఎన్‌.లలిత 81 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిందన్నారు. 59 కిలోల జూనియర్‌, సబ్‌జూనియర్‌ విభాగంలో పెద్దపాడుకు చెందిన టి.కావ్య మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్టు తెలిపారు. 59 కిలోల సీనియర్స్‌ విభాగంలో పెద్దపాడుకు చెందిన జి.వర్షిత బంగారు పతకం, జూనియర్‌ విభాగంలో సిల్వర్‌ పతకం సాధించిందని తెలిపారు. 45 కిలోల విభాగంలో పెద్దపాడుకు చెందిన డి.హేమశ్రీ జూనియర్‌, సీనియర్స్‌ విభాగల్లో కాంస్య పతకాలు సాధించిందన్నారు. పురుషుల 61 కిలోల జూనియర్‌ విభాగంలో నరసన్నపేటకు చెందిన కె.వినోద్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల్లో పాల్గొని సిల్వర్‌ మెడల్‌ సాధించినట్టు తెలిపారు. వీరిని కోచ్‌లు అప్పలరామయ్య, ఐ.అప్పన్న అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంజరాపు భాస్కరరావు తదితరులు అభినందించారు.

Updated Date - 2022-11-30T00:03:40+05:30 IST

Read more