మద్దతు ధర కల్పించేందుకు చర్యలు

ABN , First Publish Date - 2022-11-24T23:35:42+05:30 IST

రైతులకు మద్దతు ధర కల్పించి దళారుల నుంచి కాపా డేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. పాగోడు గ్రామంలో దామ భాస్కరరావు రైతు కళ్లంలో గురువారం జిల్లాలోనే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

 మద్దతు ధర కల్పించేందుకు చర్యలు
సిబ్బందికి సూచనలిస్తున్న పౌరసరఫరాల శాఖ డీఎం జయంతి

జలుమూరు: రైతులకు మద్దతు ధర కల్పించి దళారుల నుంచి కాపా డేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. పాగోడు గ్రామంలో దామ భాస్కరరావు రైతు కళ్లంలో గురువారం జిల్లాలోనే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లతో రైతుకు సంబంధం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు దామ మన్మథరావు, ఎంపీటీసీ చందనబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు

రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ పి.జయంతి తెలిపారు. పాగోడులో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం ఇచ్చిన 21 రోజుల్లో నేరుగా రైతు ఖాతాలో నగదు జమచేయనున్నట్లు చెప్పారు. క్వింటా బస్తాకు లేబర్‌ చార్జీ రూ.25, గోనె సంచికి రూ.3.50, రవాణా చార్జీలు ధాన్యం సొమ్ముతో పాటు రైతు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే హెచ్చు ధర వస్తే రైతులు బయట విక్రయించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ మేనేజరు ఎం.సృజన, వైస్‌ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, ఏవో కె.సురేష్‌, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:35:43+05:30 IST