మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-13T23:35:57+05:30 IST

మనస్తాపంతో పొన్నాడ గ్రామానికి చెందిన గురుగు గౌరి (39) అనే వివాహిత సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

 మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ఎచ్చెర్ల: మనస్తాపంతో పొన్నాడ గ్రామానికి చెందిన గురుగు గౌరి (39) అనే వివాహిత సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. భోగాపురానికి చెందిన గౌరికి పొన్నాడ గ్రామానికి చెందిన అప్పలాచారితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లక్ష్మీప్రసన్న, రేష్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మీప్రసన్న కొద్ది రోజుల క్రితం రజస్వల అయ్యింది. దీనికి సంబంధించి ఫంక్షన్‌ మరో రెండు రోజుల్లో నిర్వహించాల్సి ఉంది. ఫంక్షన్‌ నిర్వహణ విషయంలో కుటుంబ సభ్యులంతా ఒక మాటకు రాలేదు. దీనిపై మనస్తాపానికి గురైన గౌరి ఇంట్లో ఉరేసుకుంది. అప్పల చారికి ఇద్దరు అన్నదమ్ములు కాగా, అంతా కలిసి ఉంటున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T23:35:57+05:30 IST

Read more