కోర్టు భవనాన్ని మార్చాలంటూ న్యాయవాదుల రిలే దీక్ష

ABN , First Publish Date - 2022-11-30T23:30:20+05:30 IST

థిలావస్థలో ఉన్న కోర్టు భవనాన్ని మార్చాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్క రించి కోర్టు ఎదుట దీక్షలు కొనసాగించారు.

 కోర్టు భవనాన్ని మార్చాలంటూ న్యాయవాదుల రిలే దీక్ష

టెక్కలి: శిథిలావస్థలో ఉన్న కోర్టు భవనాన్ని మార్చాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్క రించి కోర్టు ఎదుట దీక్షలు కొనసాగించారు. ఈ భవనాన్ని మార్చాలని హైకోర్టు ఆదేశాలి చ్చినా జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని, దీంతో ఈ భవనంలో విధులు నిర్వహిం చలేమని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.ధర్మరాజు అన్నారు. న్యాయవాదులు పైల అరు ణ్‌కుమార్‌, దాడి ధర్మారావు దీక్షలో పాల్గొనగా వీరికి సీనియర్‌ న్యాయవాదులు దివ్వల వివే కానంద, బెండి గౌరీపతి, పేడాడ బాబూరావు, తదితరులు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-11-30T23:30:20+05:30 IST

Read more