‘వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలి’

ABN , First Publish Date - 2022-06-08T05:15:56+05:30 IST

వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు జి.సింహా చలం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

‘వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలి’
మాట్లాడుతున్న గోవిందరావు:


అరసవల్లి: వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు జి.సింహా చలం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వంశధార ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 11,305 ఎకరాల భూమిని రైతుల నుంచి కారు చౌకగా తీసుకుందని, వీరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో జిల్లాకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయిన నిర్వాసితులు ఇక్కడ బతకలేక వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. భూములు, ఇళ్లు కోల్పోయిన 12,091 కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ముఖ్యమంత్రి  ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


Read more