జగన్‌ భయపడుతున్నారు?

ABN , First Publish Date - 2022-11-24T23:39:23+05:30 IST

జనంలోకి నేరుగా వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

జగన్‌ భయపడుతున్నారు?
గార:శ్రీనివాస్‌ కుటుంబసభ్యులకు చెక్కును అందజేస్తున్న మనోహర్‌

- జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

ఎచ్చెర్ల, నవంబరు 24: జనంలోకి నేరుగా వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సమస్యలను గుర్తించే కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన డి.మత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో నిర్వహి స్తున్న వేదికలను రాజకీయ విమర్శలకు వినియోగించడం సరికాదన్నారు. బటన్‌ను నొక్కే సంప్రదాయం తప్ప, ప్రజల సమస్యలు సీఎంకు పట్టవన్నారు. చేపల వేటకు అనుకూలంగా ప్రభుత్వం ఎ లాంటి రాయితీలు, సబ్సిడీలు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో ఉద్దానం సమస్యలపై తొ లుత స్పందించిన నాయకుడు పవన్‌కల్యాణ్‌ అని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో మూడు రాజధానుల ప్రస్తావన ఎక్కడా కన్పించలేదన్నారు. యువత ఉద్యోగాల కోస మే ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి తీర ప్రాంతంలో హార్బర్‌లు, జెట్టీల నిర్మాణం జరగలేదన్నారు. మత్స్యకారుల కోసం జనసేనలో మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశామన్నారు. మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మిడి నాయకర్‌, ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాసరావు, నాయకులు కాంతిశ్రీ పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

గార: కార్యకర్తలకు అండగా ఉంటామని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త గుంటు శ్రీనివాస్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున రూ.5లక్షల చెక్కును మనోహర్‌ అందజేశారు. నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:39:40+05:30 IST

Read more