రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్సే

ABN , First Publish Date - 2022-02-20T05:00:52+05:30 IST

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయేనని ఏఐసీసీ పీఆర్వో స్పన్సర్‌లాల్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవనంలో డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అధ్యక్షతన సభ్యత్వ నమోదుపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్సే
సదస్సులో మాట్లాడుతున్న స్పన్సర్‌లాల్‌

 ఏఐసీసీ పీఆర్వో స్పన్సర్‌లాల్‌

గుజరాతీపేట, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీయేనని ఏఐసీసీ పీఆర్వో స్పన్సర్‌లాల్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవనంలో డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి అధ్యక్షతన సభ్యత్వ నమోదుపై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ, వైసీపీ, ఇతర రాజకీయ పార్టీలు  స్వలా భం కోసం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడంలేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ  నిస్వార్థపరుడని, దేశం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. పాలకపక్షం నాయకులు ప్రశ్నించేవా రిని కొనాలని చూస్తున్నారని, వినకుంటే కేసులు పెట్టిబెదిరిస్తున్నారని ఆరోపించారు. పోరాటం చేసేవారి పక్షాన కాంగ్రెస్‌ నిలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి డిజిటల్‌ సభ్యత్వనమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు అంబటి కృష్ణ, డీఎస్‌కే ప్రసాద్‌, దేశెల్ల గోవిందమల్లిబాబు, షణ్ముఖరావు, దంత త్రినాథరావు పాల్గొన్నారు. 

Read more