అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-03-19T05:25:27+05:30 IST

అంతర్రాష్ట్ర దొంగ ఆమదాలవలస పోలీసులకు పట్టుబడ్డాడు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు:


ఆమదాలవలస: అంతర్రాష్ట్ర దొంగ ఆమదాలవలస పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ వై.కృష్ణ కథనం మేరకు...ఆమదాలవలస రైల్వేకాలనీలో ఈ ఏడాది జూన్‌ 13న తన ఇంట్లో బంగారం,  వెండి, నగదు దొంగిలించినట్లు బడియా స్వతంత్రరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు.ఈ మేరకు అప్పటి ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు, ఫొరెనిక్స్‌ బృందం దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించింది.ఈ మేరకు కేసు నమోదుచేసి  పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, రాజాంలోని కస్పావీధికి చెందిన వసంతరామ్‌ శివకిశోర్‌గా గుర్తించి గాలింపు చేపట్టారు. శివకిశోర్‌ పోలీసులకు తప్పిం చుకొని తిరుగుతు న్నాడు. ఆమదాలవలస వన్‌వే కూడలి వద్ద శుక్రవారం వసంతరామ్‌ శివకిశోర్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులను చూసి పరుగులు తీయగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆయన వద్ద కొంత బంగారం, నగదు ఉన్నట్లు గుర్తించారు. శివకిశోర్‌పై వివిధ రాష్ట్రాల్లో 57 కేసులు నమోదుకాగా 35 కేసుల్లో శిక్షపడింది. ఈమేరకు అరెస్టు చేశారు.Read more