బుజ్జాయిల చేతుల్లో బొజ్జ గణపయ్య

ABN , First Publish Date - 2022-08-31T05:35:17+05:30 IST

విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలను ఉత్సాహంగా తయారుచేశారు. ఇందుకు శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ వేదికైంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘బుజ్జాయిల చేతుల్లో బొజ్జ గణపయ్య’ కార్యక్రమానికి విశేషస్పం దన లభించింది. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొ న్నారు. మట్టి వినాయకులను తయారుచేశారు. కాలుష్యరహి

బుజ్జాయిల చేతుల్లో బొజ్జ గణపయ్య
విగ్రహాలను తయారుచేస్తున్న చిన్నారులు

ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమం

విద్యార్థుల నుంచి విశేష స్పందన 

ఆసక్తికరంగా మట్టి విగ్రహాల తయారీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 30: విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలను ఉత్సాహంగా తయారుచేశారు. ఇందుకు శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ వేదికైంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘బుజ్జాయిల చేతుల్లో బొజ్జ గణపయ్య’ కార్యక్రమానికి విశేషస్పం దన లభించింది. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొ న్నారు. మట్టి వినాయకులను తయారుచేశారు. కాలుష్యరహిత వినాయక చవితి ధ్యేయంగా, సామాజిక బాధ్యతగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించింది. శ్రీకాకుళం నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు.ముందుగా కార్యక్రమాన్ని జీఎన్‌ జ్యువలెరీస్‌ ప్రతి నిధి గుడ్ల కృష్ణారావు, వెలాసిటీ స్కూల్‌ కరస్పాండెంట్‌ బమ్మిడి రమేష్‌తో పాటు ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం యూనిట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌.సోమశంకర్‌ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షకులు అప్పారావు సూచనలతో విద్యార్థులు మట్టి విగ్రహాలను రూపొందించారు. అందంగా తీర్చిదిద్దారు. న్యాయనిర్ణేతలు ముగ్గురు విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేశారు. మరో 20 మంది చిన్నారులు కన్సోలేషన్‌ బహుమ తులకు ఎంపికయ్యారు. వెలాసిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన కె.రోహణ్‌ తయారుచేసిన విగ్రహానికి ప్రథమ బహుమతి లభించింది. శ్రీకాకుళం టీపీఎం స్కూల్‌ విద్యార్థి ఎం.హరనాథ్‌ తయారుచేసిన విగ్రహానికి ద్వితీయ, శాంతినగర్‌లోని వికాస్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి కె.తరుణ్‌కుమార్‌ తయారుచేసిన విగ్రహానికి తృతీయ బహుమతి దక్కింది. విజేతలకు చీఫ్‌ స్పాన్స ర్స్‌ జీఎన్‌ జ్యువెలరీస్‌ ప్రతినిధి గుడ్ల కృష్ణారావు, వెలాసిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ బమ్మిడి రమేష్‌, క్వాలిటీ మార్ట్‌ అధినేత మెట్ట నారాయణరావు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ ఆర్‌.సోమశంకర్‌ బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్లుగా జీఎన్‌ జ్యువెలరీస్‌, వెలాసిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ వ్యవహరించాయి. కో స్పాన్సర్లుగా రవి తేజ డెవలపర్స్‌, పీవీఎస్‌ రామ్మోహన్‌రావు ఫౌండేషన్‌, పీవీఎస్‌ రామ్మోహ నరావు హాస్పిటల్స్‌, జెమ్స్‌ హాస్పిటల్‌, న్యూసెంట్రల్‌ స్కూల్‌, డాక్టర్‌ శ్రీధర్‌ హాస్పిటల్‌, బీజీఆర్‌ ఫౌండేషన్‌ వ్యవహరించాయి  

కన్సోలేషన్‌ బహుమతులు

వినాయక విగ్రహాలను తయారుచేసిన ఏబీఎస్‌ కృష్ణ, బి.హరిహర్ష, ఎం.అచ్యుతమణికంఠ, జె.కూర్మనాథ్‌, జి.సాయితేజ, టి.మౌనిక, ఎస్‌.లక్ష్మీప్రియాంక, డీవీఎం సుధీర్‌, ఎం.ఉమామహేశ్వరరావు, బి.తేజేశ్వరరావు, పి.చంద్రమౌళి, బి.బాలామణి, సీహెచ్‌ అంజలి, ఎం.విశాల్‌, ఎం.హర్ష, ఎం.లాస్యశ్రీ, టి.అక్షయ, పి.శ్రీకీర్తి, వి.గౌతం, ఎస్‌.రామచంద్ర కన్సొలేషన్‌ బహుమతులను గెలుచుకున్నారు. 


మట్టి విగ్రహాలే శ్రేయస్కరం

మట్టి వినాయక విగ్రహాల తయారీ అందరికీ శ్రేయస్కరం. గతంలో ఈ విషయం తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసి అందరూ తప్పు దిద్దుకుంటున్నారు. మట్టి విగ్రహాలనే వినియోగిస్తున్నారు. బంక మట్టితో విగ్రహాల తయారీ అనుభూతినిచ్చింది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సంస్థకు కృతజ్ఞతలు. ప్రథమ బహుమతి రావడం ఆనందంగా ఉంది.  

- కె.రోహణ్‌, ప్రథమ విజేత


ఆనందంగా ఉంది

గతంలో మార్కెట్‌లో మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేసి వినియోగించేకునేవాళ్లం. ఇప్పుడు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలను తయారు చేయించడం ఎంతో ఆనందంగా ఉంది. మట్టి విగ్రహాలను తయారుచేయించడమే కాకుండా బహుమతులను అందించడం శుభ పరిణామం.  

-ఎం.హరనాథ్‌, ద్వితీయ విజేత


మట్టి విగ్రహాలనే వినియోగిస్తాం

వినాయక చవితిలో చిన్నారులను కూడా బాధ్యత ఉందన్న విషయాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి గుర్తుచేసింది. కాలుష్యకారకాలతో విగ్రహాలు తయారుచేసేవారు. ఇప్పుడు బంకమట్టితో తయారుచేయవచ్చని కూడా తెలుసుకున్నాం. ఇక నుంచి మట్టి వినాయక విగ్రహాలనే వినియోగిస్తాం. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు.

కె.తరుణ్‌కుమార్‌, తృతీయ విజేత




Updated Date - 2022-08-31T05:35:17+05:30 IST