హరిశ్చంద్రపురంలో ఇంటర్‌ సిటీ, గుణుపూర్‌ రైలు ఆపాలి

ABN , First Publish Date - 2022-09-20T05:19:50+05:30 IST

నరసన్నపేట, కోటబొమ్మాళి, సారవకోట, టెక్కలి తదితర మండలాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండే హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌ సిటీ, గుణుపూర్‌ పాసింజర్‌ రైళ్లను నిలుపుదల చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు విశాఖ రైల్వే డీఆర్‌ఎంను కలిసి వినతిపత్రం అందించారు.

హరిశ్చంద్రపురంలో ఇంటర్‌ సిటీ, గుణుపూర్‌ రైలు ఆపాలి
డీఆర్‌ఎంకు వినతి ప్రతం అందజేస్తున్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు తదితరులు

కోటబొమ్మాళి: నరసన్నపేట, కోటబొమ్మాళి, సారవకోట, టెక్కలి తదితర మండలాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండే హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌లో ఇంటర్‌ సిటీ, గుణుపూర్‌ పాసింజర్‌ రైళ్లను నిలుపుదల చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు విశాఖ రైల్వే డీఆర్‌ఎంను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పాసింజర్‌ రైలులో ఈ ప్రాంతం నుంచి వందలాది మంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తుంటారని, ఈ సేష్టన్‌ అభివృద్ధి చెందితే రైల్వేశాఖకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. హైవేకి ఆనుకుని ఉన్నందున వ్యాపార, రవాణా సౌకర్యం కల్పిస్తే మరింత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటీవల హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్‌ అభివృద్ధిలో భాగంగా ప్లాట్‌ఫారం ఎత్తు పెంచ డం వల్ల ఇతర ప్లాట్‌ఫారాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంద ని, అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరారు. డీఆర్‌ఎం సాను కూలంగా స్పందించి హరిశ్చంద్రపురం రైల్వే హాల్ట్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోయిన రమేష్‌, తర్ర రామకృష్ణ, వెలమల కామే శ్వరరావు, నంబాళ శ్రీనివాస్‌, సాసుమంతు ఆనంద్‌ తదిత రులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-09-20T05:19:50+05:30 IST