ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2022-11-30T23:34:41+05:30 IST

ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ ఎం.నర్సింహ మూర్తి సూ చించారు. బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో మండలంలోని పలు ఆలయాల అర్చకులతో సమా వేశం నిర్వహించారు.

ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
అర్చకులకు సూచనలిస్తున్న ఎస్‌ఐ నర్సింహమూర్తి

పోలాకి: ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ ఎం.నర్సింహ మూర్తి సూ చించారు. బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో మండలంలోని పలు ఆలయాల అర్చకులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగల బెడద ఉందని, ఇటీవల వెదుళ్లవలస శివకేశవ ఆలయంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఆభరణాలను ఆలయాల్లో ఉంచవద్దన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆలయంలోని దేవుని బంగారం, వెండి, నగదును భద్ర పరిచే బాధ్యత అర్చకుల దేనన్నారు.

Updated Date - 2022-11-30T23:34:41+05:30 IST

Read more