-
-
Home » Andhra Pradesh » Srikakulam » Injustice to farmers in Titali compensation-MRGS-AndhraPradesh
-
తితలీ పరిహారంలో రైతులకు అన్యాయం
ABN , First Publish Date - 2022-07-06T05:19:00+05:30 IST
తితలీ తుఫాన్‌లో సర్వం కోల్పోయిన సుమారు 6,600 మందికి పరిహారం ఇవ్వలేదని, ఇటీవల ప్రభుత్వం వేసిన అదనపు పరిహారం కూడా వీరికి అందలేదని, దీంతో రైతులు ఇబ్బందులకు గురవు తున్నారని ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షుడు మామిడి మాధవరావు అన్నారు.

హరిపురం: తితలీ తుఫాన్‌లో సర్వం కోల్పోయిన సుమారు 6,600 మందికి పరిహారం ఇవ్వలేదని, ఇటీవల ప్రభుత్వం వేసిన అదనపు పరిహారం కూడా వీరికి అందలేదని, దీంతో రైతులు ఇబ్బందులకు గురవు తున్నారని ఉద్దానం రైతాంగ సమస్యల సాధన కమిటీ అధ్యక్షుడు మామిడి మాధవరావు అన్నారు. హరిపురం మార్పు ట్రస్టు భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలు చూపిస్తూ పరిహారం నిలుపుదల చేసిన వారికి తక్షణం న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు మజ్జి బాబూరావు, హేమరావు చౌదరి, నల్ల హడ్డీ, సోమనాథం పాల్గొన్నారు.