సినీ ఫక్కీలో.. స్కూటీ డిక్కీలోని నగదు చోరీ

ABN , First Publish Date - 2022-06-07T06:11:28+05:30 IST

ద్విచక్ర వాహనం డిక్కీలోనినగదు చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత నెల 30న పీర్‌లెస్‌ రిటైర్డ్‌ ఉద్యోగి రాజేశ్వరరావు పట్నాయక్‌ స్థానిక కరూర్‌ వైశ్య బ్యాంక్‌ నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసి ఇంటికి వెళ్లే క్రమంలో స్కూటీ డిక్కీలో పెట్టాడు. స్థానిక వినాయక ఆలయం సమీపంలో మజ్జిగ తాగేం దుకు దిగాడు. అప్పటికే రాజేశ్వరరావు పట్నాయక్‌ను ఫాలో అవుతున్న చెన్నైకు చెందిన వి.శ్యామ్‌, చిత్తూరుకు చెందిన వెంకటేష్‌లు సినీ పక్కీలో డిక్కీలో ఉన్న నగదు చోరీ చేసి పరారయ్యారు.

సినీ ఫక్కీలో.. స్కూటీ డిక్కీలోని నగదు చోరీ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి:ద్విచక్ర వాహనం డిక్కీలోనినగదు చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత నెల 30న పీర్‌లెస్‌ రిటైర్డ్‌ ఉద్యోగి రాజేశ్వరరావు పట్నాయక్‌ స్థానిక కరూర్‌ వైశ్య బ్యాంక్‌ నుంచి రూ.2 లక్షలు విత్‌డ్రా చేసి ఇంటికి వెళ్లే క్రమంలో స్కూటీ డిక్కీలో పెట్టాడు. స్థానిక వినాయక ఆలయం సమీపంలో మజ్జిగ తాగేం దుకు దిగాడు. అప్పటికే రాజేశ్వరరావు పట్నాయక్‌ను ఫాలో అవుతున్న చెన్నైకు చెందిన వి.శ్యామ్‌, చిత్తూరుకు చెందిన వెంకటేష్‌లు సినీ పక్కీలో డిక్కీలో ఉన్న నగదు చోరీ చేసి పరారయ్యారు. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం నిందితులు శ్యామ్‌, వెంకటేష్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచినట్టు సీఐ ఈశ్వర్‌ప్రసాద్‌ తెలిపారు.

 

Read more