పీక కొసినా తప్పుచేయను

ABN , First Publish Date - 2022-11-18T23:54:42+05:30 IST

కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో తనకు సెంటు భూమైనా లేదని, పీకకోసినా తప్పుచేయనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

పీక కొసినా తప్పుచేయను

శ్రీకాకుళం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌కు వెళ్లే 80 అడుగుల రోడ్డులో తనకు సెంటు భూమైనా లేదని, పీకకోసినా తప్పుచేయనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. బాదుర్లపేటలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించేశానని విపక్ష నాయకులు ప్రచారం చేస్తున్నారని, ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయనని, ఒకవేళ తప్పిదాలుంటే సరిదిద్దుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-11-18T23:54:42+05:30 IST

Read more