భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-09T04:03:35+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం జిల్లా అంతటా వర్షం కురిసింది. రణస్థలం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి రాత్రి వరకూ మధ్యమధ్యలో తెరిపిస్తూ జల్లులు పడ్డాయి. పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి.

భారీ వర్షం
శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షం

- జిల్లా అంతటా వానలు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- నేడూ భారీ వర్ష సూచన
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/నరసన్నపేట/ టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 8)

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం జిల్లా అంతటా వర్షం కురిసింది. రణస్థలం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస, టెక్కలి, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి రాత్రి వరకూ మధ్యమధ్యలో తెరిపిస్తూ  జల్లులు పడ్డాయి. పలుప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. కొత్తూరులో కుండపోతగా పడింది. ఇక్కడ అత్యధికంగా 63.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మందస మండలం హరిపురంలో 0.25మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో అడుగున్నర ఎత్తులో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రణస్థలం, ఆమదాలవలస, నరసన్నపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వరదనీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెక్కలి పాతజాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయి.. చెరువును తలపించింది. స్థానిక ఇందిరాగాంఽధీ కూడలి నుంచి భవానీ నగర్‌ రోడ్డు వరకు వర్షపునీరు నిలిచిపోయింది. టెక్కలి-పలాస, మెళియాపుట్టి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇదే ప్రధానమైన మార్గం కావడం, కాలువలు మూసుకుపోవడంతో తరచూ సమస్య ఉత్పన్నమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో శుక్రవారం కూడా భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
 
జిల్లాలో నమోదైన వర్షపాతం (మిల్లీ మీటర్లు)
-----------------------
కొత్తూరు        63.25
రణస్థలం        52.75
ఆమదాలవలస    32.5
నరసన్నపేట    22.0
పలాస        16.5
టెక్కలి        16.5
సారవకోట    14.75
లావేరు        14.75
కవిటి        13.0
ఇచ్ఛాపురం    8.75
నందిగాం        8.5
శ్రీకాకుళం        8.25
సంతబొమ్మాళి    8.0
బూర్జ        7.5
సరుబుజ్జిలి    7.0
కంచిలి        7.0
ఎల్‌ఎన్‌పేట    6.75
కోటబొమ్మాళి    6.5
జలుమూరు    5.5
పోలాకి        4.75
ఎచ్చెర్ల        3.75
గార        3.5
పొందూరు    3.5
సోంపేట        3.0
పాతపట్నం    1.75
హిరమండలం    0.75
మందస        0.25   Read more