కల్లంలోనే ధాన్యం నాణ్యత పరీక్షలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-12-13T23:35:05+05:30 IST

రైతు లు పండించిన ధాన్యం నాణ్యతను కల్లంలోనే పరీక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల మెలికతో మంగళవారం ‘2 కేజీలు అదనం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనిపై ఆయన స్పందించి మండలస్థాయి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.

 కల్లంలోనే ధాన్యం నాణ్యత పరీక్షలు చేపట్టాలి
అధికారులకు సూచనలిస్తున్న జేసీ నవీన్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

జలుమూరు: రైతు లు పండించిన ధాన్యం నాణ్యతను కల్లంలోనే పరీక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల మెలికతో మంగళవారం ‘2 కేజీలు అదనం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనిపై ఆయ న స్పందించి మండలస్థాయి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు సృషి ్టస్తున్న సమస్య లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కల్లంలో ధాన్యం పరీక్షలు చేసినాణ్యత నిర్థారించి న తరువాత మిల్లర్లు తేమశాతం అధికంగా ఉందని బస్తాకు 2 కేజీలు తరుగు అడుగుతున్నారని సిబ్బంది జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన.. కల్లంలోనే ధాన్యం నాణ్యతను సరిగా చూసి మిల్లులకు పంపాలన్నారు. గ్రామస్థాయి నాయకులు చెప్పారని నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. ధాన్యం కొనుగోలు చేసేటపుడు నాణ్యత పరిశీలన, ప్రొక్యూర్‌మెంటు, ఎఫ్‌టీవో జనరేట్‌, ట్రక్కు షీట్‌ జనరేట్‌ ఒకేరోజు జరిగేలా చూడాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం నాణ్యత పరీక్షలు చేయాలన్నా రు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి కె.రాజగోపాలరావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, సీఎస్‌డీటీ గణేష్‌, ఏవో కె.సురేష్‌, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు సారవకోట మండలం కుమ్మరిగుంట కల్లంలో ధాన్యాన్ని పరిశీలించి కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.ప్రవల్లికప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డీఎస్‌వో డీవీ రమణ మంగళవారం వెంకటసాయి రైస్‌ మిల్లును తనిఖీ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన స్పందించి ఆకస్మికంగా పరిశీలించారు. నాణ్యత కారణం చూపి బస్తాకు అదనంగా వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Updated Date - 2022-12-13T23:35:05+05:30 IST

Read more